అపచారం.. అపచారం... అయ్యప్ప దేవాలయం శుద్ధి...(Video)

sabarimala
Last Modified బుధవారం, 2 జనవరి 2019 (12:58 IST)
అయ్యప్ప దేవాలయం శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన కోజికోడ్‌ జిల్లాకు చెందిన 42 ఏళ్ల బిందు, 44 ఏళ్ల కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు వెళ్లారన్న సమాచారం తెలియగానే శబరిమలలో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. బహిస్టులో వున్న మహిళలు ఇలా శబరిమల ఆలయాన్ని దర్శించుకోవడంతో... అపచారమనీ, వెంటనే ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేశారు. ఆ తర్వాత మళ్లీ తెరిచారు.

కాగా
తాము మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పంబాకు చేరుకున్నామనీ, అక్కడి నుంచి తమకు ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే 18 మెట్లెక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు మహిళలు వివరించారు. కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ తమను ప్రశ్నించలేదని చెప్పుకొచ్చారు. బహుశా జనవరి 1 కావడంతో అంతా ఎవరి గొడవల్లో వారు మునిగిపోయి వుంటారు. ఏదేమైనప్పటికీ ఏళ్లనాటి ఆచారాన్ని అధిగమించి మహిళలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టారు.చూడండి వీడియో...దీనిపై మరింత చదవండి :