1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2016 (12:19 IST)

కుదుటపడుతున్న జయలలిత ఆరోగ్యం.. లండన్ డాక్టర్ వచ్చాక డిశ్చార్జ్

ముఖ్యమంత్రి జయలలిత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరి చాలారోజులైంది. కేవలం రెండు, మూడు రోజుల్లో అమ్మ డిశ్చార్జ్ అవుతారని ఎదురుచూసిన పార్టీ శ్రేణులు, అభిమానులు రోజులు గడిచిపోతున్న కొ

ముఖ్యమంత్రి జయలలిత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరి చాలారోజులైంది. కేవలం రెండు, మూడు రోజుల్లో అమ్మ డిశ్చార్జ్ అవుతారని ఎదురుచూసిన పార్టీ శ్రేణులు, అభిమానులు రోజులు గడిచిపోతున్న కొద్దీ లోలోన నిరాశకు లోనయ్యారు. అయితే అపోలో ఆసుపత్రి వారు, పార్టీ అధికార ప్రతినిధులు మాత్రం అమ్మ వేగంగా కోలుకుంటున్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని ఎప్పటికప్పుడు ధీమాను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 
 
ఇదిలావుండగా జయలలిత ఆరోగ్యంపై కొందరు వ్యక్తులు గత నెల 30వ తేదీన వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ సాంఘిక మాధ్యమాల ద్వారా అవాంఛనీయమైన వదంతులు పుట్టించారు. సెప్టెంబరు 22వ తేదీ అర్థరాత్రి వేళ హుటాహుటిన అమ్మను చెన్నై అపోలో చేర్పించటం.. ఆమె ఆరోగ్యంపై పలు వదంతులు వినిపించటం.. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైనట్లుగా చెప్పటం లాంటివి ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి. 
 
ఇంతా చేస్తే.. అమ్మకు ఏమైందంటే జ్వరం.. డీహైడ్రేషన్ అని చెప్పారే కానీ అసలు మాట మాత్రం చెప్పింది లేదు. అసలు జయలలిత ఆరోగ్యానికి ఏమైంది ? ఎంతో రహస్యంగా ఈ ప్రశ్నకి సంబంధించిన సమాధానాన్ని కూడా దాచేస్తున్నారు. ఆమె ఆసుపత్రిలో చేరి నెల కావొస్తుంది. ఆమె ఆరోగ్యంపై అనేక రూమర్లు, పుకార్లు వస్తూనే వున్నాయి. అమ్మ ఆరోగ్యం విషమించిందని, ఆమె ఇక కొన్ని రోజులే బ్రతుకుతారని, అమ్మ కోలుకుంటున్నారని అంటూనే వున్నారు. 
 
అయితే వైద్యులు మాత్రం ప్రస్తుతం అమ్మకి వెంటిలేటర్ తొలగించారంట. మొదట్లో అమ్మ కృత్రిమ శ్వాస అందించారంట. కానీ ప్రస్తుతం సాధారణ శ్వాస తీసుకుంటున్నారని వినికిడి. అయితే అమ్మ ఆరోగ్యంపై ఒక ఆసక్తికర వార్త వెలువడింది. అమ్మ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వాలంటే ఆయన రావాలంట. ఆయన వస్తేగాని ఆమెని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందొ లేదో అన్నది చెబుతారంట. 
 
డాక్టర్ రిచర్డ్ వస్తే గాని ఆమెని పంపాలా వద్ద అన్న దానిపై ఒక స్పష్టత వస్తారంట. మరో నాలుగు రోజులో ఆయన చెన్నైకి రానున్నారు. అయితే దాదాపుగా అమ్మని ఇంటికి పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ డాక్టర్ అయినా స్పష్టత ఇస్తారో లేదో ? అయితే ఈ విషయం తెలిసిన అమ్మ అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో కాస్త ధైర్యం వచ్చిందంట.