మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (14:23 IST)

UGC-NET పరీక్షలకు రంగం సిద్ధం.. మేలో 11 రోజుల పాటు..?

ఈ ఏడాది మే నెలలో UGC-NET పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటన చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 2 నుంచి 17 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ వెల్లడించారు.

సబ్జెక్టుల వారీగా మే 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14, 17 తేదీల్లో మొత్తం 11 రోజులపాటు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 
 
జూనియర్ రిసెర్చ్ ఫెలో షిప్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత కోసం కేంద్రం ఏటా యూజీసీ-నెట్ పరీక్షలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.