శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (13:09 IST)

నిరుద్యోగి.. రేప్ చేసే ముందు కాళ్లు తొలగిస్తాడు..

నిర్భయ లాంటి ఘటనలు సంభవించినా.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కఠినమైన శిక్షలను అమలు చేసేందుకు చట్ట సవరణ చేసేందుకు ముందుకు రావట్లేదు. 


తాజాగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో 20 ఏళ్ల నిరుద్యోగి.. తొమ్మిది మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు నుంచి ఏడేళ్ల లోపు గల తొమ్మిది మంది బాలికలపై 20 ఏళ్ల కామాంధుడు.. గత రెండేళ్లుగా అత్యాచారం చేయడం.. ఆపై హతమార్చేవాడని తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో బాలికలు అదృశ్యం కావడం, కిడ్నాప్‌కు గురికావడం వెనుక లైంగిక దాడిలే కారణమని పోలీసులు కనుగొన్నారు. ఇంకా గత రెండేళ్ల పాటు తొమ్మిది మంది బాలికలు కనిపించట్లేదని ఫిర్యాలు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
నవంబర్ 11న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో నిందితుడు సైకోలా ప్రవర్తించేవాడని.. బాలికలపై అత్యాచారానికి పాల్పడేందుకు ముందు నిందితుడు కాళ్లను తొలగిస్తాడని.. గురుగ్రామ్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ సుభాష్ బోకెన్ తెలిపారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచామని... అతడికి ఎనిమిదిరోజులు పోలీసులు రిమాండ్ విధించడం జరిగిందన్నారు.