సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మార్చి 2020 (17:37 IST)

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేకు పదేళ్ళ జైలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పదేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టు తీర్పును వెలువరించింది. ఉన్నావ్ అత్యాచార కేసులో కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. ఇదే కేసులో ఆయన సోదరుడు అతుల్ సింగార్‌కు  కూడా ఇదే శిక్షను విధించింది. 
 
2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌ ఓ మైనర్‌ను అత్యాచారం చేశాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలి తండ్రిని నేరపూరితంగా తప్పుగా ఆయుధాల చట్టం కింద కేసులో ఇరికించారు. ఆ తర్వాత 2018 ఏప్రిల్ 9వ తేదీన జూడిషియల్‌ కస్టడిలో ఉండగానే మృతిచెందాడు. ఇది మరింత సంచలనంగా మారింది.
 
దీంతో ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ హత్య కేసులో సాక్ష్యాధారాలన్ని పరిశీలించిన కోర్టు ముద్దాయిలు నేరం చేసినట్టు తేలడంతో శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చింది.