శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (10:55 IST)

రక్షకుడే రాక్షసుడైతే..? కేసు గురించి మాట్లాడాలని హోటల్‌కి రమ్మని..?

రక్షకులే రాక్షసులవుతున్నారు. క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా స్పెషల్ పోలీసు అధికారిణి ఆరోపించారు. దీంతో ఉన్నతాధికారులు ఆ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాకేశ్‌ యాదవ్‌ క్రైం బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2018లో మహిళా పోలీసు కుటుంబ సభ్యులు ఒకరు ఆమె అత్తమామలపై వరకట్న వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సాస్ని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసును రాకేష్ యాదవ్ విచారిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 29న వరకట్న వేధింపుల కేసుకు సంబంధించి కొన్ని డాక్యూమెంట్స్ కావాలని రాకేష్ యాదవ్ మహిళ పోలీసును కోరాడు. అయితే తనను పోలీసు స్టేషన్‌లో కాకుండా బయట ఓ హోటల్‌లో కలవాలని చెప్పాడు. అలా అయితే కేసుకు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడవచ్చని అన్నాడు.
 
దీంతో మహిళ పోలీసు హోటల్ రూమ్‌కు వెళ్లింది. అయితే అక్కడ రాకేష్ యాదవ్ తనను అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పోలీసు ఆరోపిస్తుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని రాకేష్ యాదవ్ బెదిరించాడని ఆమె చెప్పారు. దీంతో ఆమె ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు భయపడిపోయారు. అయితే గత కొన్ని రోజులుగా ఇన్‌స్పెక్టర్ రాకేష్ యాదవ్ ఆమె మొబైల్‌కు అసభ్యకరంగా కాల్స్ చేయడం ప్రారంభించాడు. 
 
దీంతో ఆ మహిళా పోలీసు సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసును ఆశ్రయించారు. అలాగే ఫోన్‌లో తనతో అసభ్యకరంగా మాట్లాడిని క్లిప్స్‌ను అందజేశారు. ఈ ఘటనపై ఎస్‌ఎస్‌పీ స్పందిస్తూ ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్ రాకేష్ యాదవ్ పరారీలో ఉన్నాడని.. అతన్ని పట్టుకునేందకు గాలింపు చేపట్టారని తెలిపారు.