శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జులై 2023 (17:32 IST)

కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి హత్య

murder
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి హత్య చేసింది. ఆపై బాడీని ఐదు ముక్కలు చేసి కాలువలో పడేసింది. వివరాల్లోకి వెళితే, గజ్రౌలా ప్రాంతంలోని శివనగర్‌కు చెందిన రామ్ పాల్, దులారో దేవి భార్యాభర్తలు. అయితే దులారో దేవి గొత కొన్ని రోజులుగా భర్త స్నేహితుడితో కలిసి వుంటోంది. ఈ క్రమంలో నెలరోజుల తర్వాత కొడుకు, కోడలి వద్దకు వచ్చింది. 
 
వచ్చీ రాగానే భర్త అదృశ్యమయ్యాడని కుమారుడు సోన్ పాల్‌కు తెలియజేసింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దులారో దేవిని అరెస్ట్ చేసి విచారించారు. విచారణ సందర్భంగా భర్తను తానే చంపినట్లు నేరం అంగీకరించింది.