నా ప్రియురాలు లేకుండా నేను బతకలేను.. అందుకే ఇలా చేస్తున్నా...

suicide
Last Updated: సోమవారం, 22 జులై 2019 (14:15 IST)
తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు దూరమైందన్న బాధను తట్టుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రా జిల్లా రాయభ గ్రామానికి చెందిన శ్యాం శికార్‌వార్ అలియాస్ రాజ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇంతలో తన ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థమైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రేమికుడు శ్యాం తట్టుకోలేకపోయాడు. అంతే.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్యచేసుకున్నాడు.

చనిపోయేముందు ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. నా ప్రియురాలికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. నా ప్రియురాలు లేకుండా నేను బతకలేను. ప్రియురాలు నాకు దూరమైందనే బాధ, ఒత్తిడి వల్ల గురుగ్రామ్ కంపెనీలో ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాను.

అందుకే చేసుకుంటున్నా అని శ్యాం నాలుగు పేజీల లేఖను రాసిపెట్టి స్థానికంగా ఉండే దేవాలయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ లేఖలో రాసిపెట్టాడు.దీనిపై మరింత చదవండి :