మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (15:10 IST)

17 ఏళ్ల బాలికను వేధించారు.. రెండంతస్తుల మేడ నుంచి తోసేశారు..

17 ఏళ్ల బాలికను వేధించిన ముగ్గురు వ్యక్తులు ఆమె ప్రతిఘటించడంతో రెండంతస్తుల మేడ నుంచి తోసేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. ఈ మొత్తం ఘటన సిసిటివి ఫుటేజ్‌లో రికార్డు అయింది. కాగా, తీవ్రంగా గాయపడ్డ యువతి... ప్రాణాలతో బయటపడ్డప్పటికీ... వెన్నుముక బాగా దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారు. 
 
కాగా, ముగ్గురు వ్యక్తులుపై తండ్రి ఫిర్యాదు చేశారు. వీరంతా తమ నివాసానికి దగ్గరగా ఉంటారని చెప్పారు. గత కొన్ని రోజులుగా తన కుమార్తెను ఏడిపిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఓ వ్యక్తి తన నెంబర్‌కు ఫోన్‌ చేసి... తన కుమార్తెతో మాట్లాడాలని కోరగా.. ఫోన్‌ ఇవ్వనని చెప్పడంతో... తనను తిట్టడం మొదలు పెట్టాడని తెలిపారు. 
 
అనంతరం అదే రోజు ఆమె ఇంటిలోకి ప్రవేశించి యువతిని వేధించి అక్కడ నుండి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతలో కుటుంబ సభ్యులు అరవడంతో రెండవ అంతస్తు బాల్కనీ నుండి కిందకు తోసేయడంతో ఆ యువతి రోడ్డుపై పడిపోయింది. తండ్రి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.