శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (11:17 IST)

బాలికపై గ్యాంగ్ రేప్.. శీలానికి రూ.80వేలు.. సోదరుడిని వెలివేశారు..

బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే శీలానికి వెలకట్టారు.. గ్రామ పెద్దలు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాల్సిందిపోయి.. ఆ బాలిక శీలానికి రూ.80వేలు వెలకట్టారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ

బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే శీలానికి వెలకట్టారు.. గ్రామ పెద్దలు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాల్సిందిపోయి.. ఆ బాలిక శీలానికి రూ.80వేలు వెలకట్టారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. అలీఘడ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను నలుగురు యువకులు నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. బాధిత బాలికకు తల్లిదండ్రులు మరణించడంతో సోదరుడు ఒక్కడే ఉన్నాడు. గ్రామ పెద్దలు సమావేశమై అత్యాచారం చేసిన నలుగురు కామాంధులు బాధిత బాలికకు రూ.80వేలు జరిమానాగా చెల్లించాలని పంచాయితీలో తీర్పు చెప్పారు.
 
గ్రామ పెద్దల పంచాయితీపై మండిపడిన బాలిక సోదరుడు... తమకు నష్టపరిహారం అక్కరలేదని, నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులైన చేతన్ (24), లఖన్ (30), లలిత్ కుమార్ (22), వికాస్ (24)లపై ఐపీసీ సెక్షన్ 376 డి, 354, 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 
 
పంచాయితీ పెద్దల తీర్పును వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి సోదరుడిపై గ్రామం నుంచి బహిష్కరించారు. కాగా పోలీసులు గ్రామ పెద్దలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.