Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కట్నం ఇవ్వలేదని భార్యను చంపేసిన భర్త.. యూపీలో దారుణం

ఆదివారం, 6 మే 2018 (13:37 IST)

Widgets Magazine

తన పెళ్లికి ఖర్చు చేసిన మొత్తంలో 15 లక్షల ను కట్నం కింద ఇవ్వనందుకు కట్టుకున్న భార్యను కసాయి భర్త చంపేశాడు. అదీ కూడా పెళ్లయిన కేవలం 10 రోజులకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
accused
 
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షార్ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. యూపీకి చెందిన రవికాంత్‌గిరితో పింకి(ఢిల్లీ)కి పది రోజుల క్రితం వివాహమైంది. అయితే రవికాంత్ తన పెళ్లి పేర రూ.20 లక్షలు ఖర్చు చేశాడు. 
 
దీంతో రూ.15 లక్షలు కట్నం కింద ఇవ్వాలని పింకిని వేధింపులకు గురిచేశాడు. శుక్రవారం రాత్రి ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫోన్ చేసి.. తన భార్యను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చేశారంటూ పోలీసులను నమ్మించాడు. 
 
ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడంతో రవికాంత్‌ను పలు కోణాల్లో విచారించారు. మొత్తానికి పింకిని తానే హత్య చేసినట్లు భర్త రవికాంత్ ఒప్పుకున్నాడు. ఈ కేసులో రవికాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
మరోవైపు, బీహార్‌లో దారుణం జరిగింది. ఒక అమ్మాయి మరో అమ్మాయితో స్వలింగసంపర్కం కొనసాగిస్తుందని కొందరు యువకులు అనుమానం పెట్టుకున్నారు. దీంతో ఆ అమ్మాయిని ఒక పోల్‌కు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనను రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి వైరల్ చేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నమాజ్ రోడ్లపై చేయండి... హర్యానా సీఎం ఖట్టర్

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటి హర్యానా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ...

news

నీ అదృష్టం బాగుండీ మంత్రివయ్యావు.. మంత్రి ఆదిపై ఎమ్మెల్యే ఫైర్

ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే ...

news

ఎమ్మెల్యేతో రాహుల్ గాంధీ వివాహం.. సోషల్ మీడియాలో వైరల్

దేశ రాజకీయ నేతల్లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ...

news

వారితో ప్రాక్టికల్స్ చేస్తేనే.. ప్రాక్టికల్ మార్కులు వేస్తారట.. గవర్నర్‌కు విద్యార్థిని లేఖ

తిరుపతి రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న కొందరు విద్యార్థులు ...

Widgets Magazine