శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (10:38 IST)

ఆ ఊర్లో అందరూ ఐఏఎస్‌లే... 75 కుటుంబాల్లో 45 మంది ఐఏఎస్‌లు.. ఏ రాష్ట్రంలో....

సాధారణంగా ఒక ఊర్లో ఒక ఐఏఎస్ అధికారి ఉండటం చాలాచాలా అరుదైన విషయం. కానీ, ఆ గ్రామంలో మాత్రం ఏకంగా 47 మంది యువకులు ఐఏఎస్ అధికారులుగా ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న మొత్తం కుటుంబాలు 75. ఈ గ్రామంలోని యువత సంవత్సరానికి కనీసం 0.4 శాతం మంది ఐఏఎస్ ఎగ్జామ్‌లో ఫైనల్ స్టేజికి వెళ్తున్నారు. 
 
కుటుంబానికి కనీసం ఒక్కరైనా ఐఏఎస్ ఆఫీసర్లున్నారంటే ఆ ఊరివాళ్ల టాలెంట్ ఏంటో అర్థమవుతోంది. 1955లో ఐఏఎస్ పరీక్ష రాసిన వినయ్‌కుమార్ సింగ్ రిటైర్మెంట్ నాటికి బీహార్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఛత్రపాల్ తమిళనాడుకు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. వీళ్లందరి కంటే ముందు 1914లో బ్రిటీష్ పాలనాకాలంలో సివిల్ సర్వీస్‌లో చేరిన ముస్తఫా హుస్సేన్ మాకు స్ఫూర్తి అని చెప్తారు ఆ ఊరి ఐఏఎస్ ఆఫీసర్లు. 
 
ఎలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లరు ఆ ఊరి ఐఏఎస్ అభ్యర్థులు. కనీసం విద్యుత్, రోడ్డు సౌకర్యం కూడా లేని ఆ ఊరి ప్రజలు తమ ఊరికి 47 మంది ఐఏఎస్ ఆఫీసర్లున్నారని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ గ్రామం పేరు ఏంటో తెలుసా... జాన్‌పూర్‌. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఐఏఎస్‌ల కారణంగా ఈ గ్రామం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.