సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (13:56 IST)

ఫేస్‌బుక్ స్నేహితుడు అలా చేశాడు.. హోటల్ గదిలో బంధించి సోదరులతో కలిసి?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి నేరాలను అడ్డుకునేందుకు చట్టం తన పని తాను చేసుకుపోతున్నా.. కఠినమైన శిక్షల కోసం కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.


తాజాగా యూపీలో ఘోరం జరిగింది. స్నేహం పేరుతో యువతిని నమ్మించి గొంతుకోశాడో యువకుడు. హోటల్‌ గదిలో నిర్భంధించి.. తన సోదరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీ, షామీ జిల్లాకు చెందిన సోనూ అనే యువకుడికి 23 ఏళ్ల యువతి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త హోటల్‌లో కలుసుకునేంత వరకు వెళ్లింది. ముందుగా అనుకున్నట్లు ఆ యువతి హోటల్ గదికి రాగానే సోనూ తన సోదరులతో కలిసి ఆమెను బంధించాడు. అనంతరం వారితో కలిసి బాధితురాలిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. 
 
అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆపై తనను వివాహం చేసుకోవాలని లేకుంటే.. వీడియో నెట్లో పెడుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.