శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (17:51 IST)

పవిత్ర గంగానదికి ప్రాణికోటికున్న హక్కులు... ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పు

ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. పరమ పవిత్రమైన నదిగా పూజించే గంగానదికి అసాధారణ హక్కులను కల్పిస్తూ తీర్పునిచ్చింది. భూమిపై నివశించే ప్రాణికోటికి ఎలాంటి హక్కులున్నాయో జీవనది గంగానది కూడా అలాంటి హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొంద

ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. పరమ పవిత్రమైన నదిగా పూజించే గంగానదికి అసాధారణ హక్కులను కల్పిస్తూ తీర్పునిచ్చింది. భూమిపై నివశించే ప్రాణికోటికి ఎలాంటి హక్కులున్నాయో జీవనది గంగానది కూడా అలాంటి హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొంది. భరత గడ్డపై తొలిసారిగా ఇటువంటి హక్కులను గంగానదికి కల్పిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. మానవులకు ఉన్న అన్ని హక్కులూ ఇకపై గంగానదికి కూడా ఉంటాయని స్పష్టంచేసింది. గంగానదికి ఉపనదిగా ఉన్న యమునకు కూడా ఇదేవిధమైన హక్కులు వర్తిస్తాయని పేర్కొంది.
 
తమ ఆదేశాల మేరకు పవిత్రమైన నదిని ఇకపై ఎవరైనా కలుషితం చేస్తే, సాటి మానవుడి హక్కులకు భంగం కలిగిస్తే, ఐపీసీ కింద పెట్టే కేసులనే నమోదు చేయాలని ఆదేశించింది. నదిని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు, చేసేందుకు ప్రభుత్వం గంగా అడ్మినిస్ట్రేషన్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. భావి తరాలకు ఈ జీవనదిని అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 
 
ఇదిలావుండగా, ప్రపంచంలో మానవునికి కలిగిన హక్కులను కల్పిస్తూ ఇంతకుమునుపే న్యూజీలాండ్ లోని వాంగ్‌నూయ్ నది చరిత్రపుటలకెక్కింది. 145 కిలోమీటర్ల మేరకు ప్రవహించే ఈ నది... ప్రపంచంలో ఈ హోదాను దక్కించుకున్న తొలి నదిగా వాంగనూయ్ నిలిచింది. ఇప్పుడు గంగ, యమునలకూ ఇదే హోదా దక్కడం విశేషం.