ఉత్తరాఖండ్‌లో కొండ చరియలు విరిగిపడి 53 మంది మృతి
ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇది చాలదన్నట్టు కొండ చరియలు విరిగి పడటంతో చాలా చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని కొండచరియలు విరిగిపడి 52మంది మృతి చెందారు.
మరో ఐదుగురి ఆచూకి తెలియరాలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడటంతో రెండు రోజులుగా నైనితాల్‌కు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. కారణంగా గత మూడు రోజుల్లో 8,000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.