శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (09:29 IST)

ఆస్పత్రిలో చేరిన డీఎండీకే అధినేత విజయకాంత్.. ఎందుకు?

vijayakanth
సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఆయన బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. 
 
తాజాగా దీపావళి పండుగ సందర్భంగా విజయకాంత్ తన కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలను విడుదల చేశారు. ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత 2 రోజులుగా దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.   
 
ఈ మేరకు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో, "విజయకాంత్ సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారని, ఆయన రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని అన్నారు. వదంతులను ఎవరూ నమ్మవద్దు..." అంటూ చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు DMDK అధికారులు లేదా ఆసుపత్రి యాజమాన్యం నుండి అధికారిక ప్రెస్ నోట్ కోసం వేచి చూస్తున్నారు. ఆయన కోలుకోవాలని విజయకాంత్ మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.