శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (05:49 IST)

దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు

అంతర్జాతీయ యోగాదినోత్సవం (జూన్ 21)సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
 
ఉపరాష్ట్రపతి సందేశం... 
అందరికీ అంతర్జాతీయ యోగాదినోత్సవ శుభాకాంక్షలు. శారీరక ఆరోగ్యం, మానసిక సంతులనం పొందడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు యోగాభ్యాసం ఉత్తమమైన మార్గం. కరోనా నేపథ్యంలో భారతీయ సంప్రదాయ జీవన విధానమైన యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరముంది. 
 
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలి. దీంతో వ్యక్తిగతంగా తద్వారా సమాజంలో శాంతి సామరస్యాలు, సుహృద్భావ వాతావరణం నెలకొంటాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను.