శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

డిసెంబరు నెల అంటేనే వణికిపోతున్న తమిళనేతలు .. ఎందుకో తెలుసా?

tamil leaders
తమిళ నేతలకు డిసెంబరు నెల ఏమాత్రం అచ్చిరావడం లేదు. ఈ నెల వస్తేనే ఆ రాష్ట్ర సినీ రాజకీయ నేతతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా వణికిపోతున్నారు. ప్రతియేటా క్రమం తప్పకుండా డిసెంబరు నెలలో తుఫాన్లు, సునామీలు వస్తున్నాయి. మరోవైపు ఎవరో ఒకరు ప్రముఖ నేతలు కన్నుమూస్తున్నారు. అందుకే తమిళ నేతలకు, తమిళ ప్రజలకు డిసెంబరు నెల అంటేనే గజగజ వణికిపోతున్నారు. 
 
తుఫానులు, సునామీలతో రాష్ట్రాన్ని బెంబేలెత్తించిన డిసెంబరు నెల ముగ్గురు మహా నేతలను కనుమరుగు చేసింది. వీరిలో అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంజీఆర్ డిసెంబరు 24వ తేదీన చనిపోయారు. ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పురట్చితలైవి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంబారినపడి 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది డిసెంబరు 5వ తేదీన తుదశ్వాస విడిచారు. అలాగే, ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ కూడా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబరు 28వ తేదీ గురువారం తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. 
 
ఈ ముగ్గురి కంటే ముందు ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ కూడా డిసెంబరు 24వ తేదీనే కన్నుమూశారు. ఇలా డిసెంబరు నెల ప్రముఖ రాజకీయ నాయకులకు అచ్చిరాని నెలగా మారింది. అయితే, ఈ నాయకులంతా డిసెంబరులో తమిళ నెల మార్గళిమాసంలో మృతి చెందడం వల్ల వైకుంఠం లభిస్తుందని, నేరుగా స్వర్గానికి వెళ్తారని పంచాంగకర్తలు చెబుతున్నారు. 
 
సైనైడ్ తాగి ఆత్మహత్య.. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులే... 
 
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంతా సైనైడ్ తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అప్పుల బాధ తాళలేక వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. 
 
గుంటూరు జిల్లాకు చెందిన ఓ స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబం గత కొంతకాలంగా అనకాపల్లిలో ఉంటుంది. గురువారం రాత్రి వీరంతా ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన సైనైడ్ సేవించారు. వీరిలో శివరామకృష్ణ (40), మాధవి (38), వైష్ణవి (16), లక్ష్మి (13)లు ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ సైనైడ్ సేవించిన మరో కుమార్తె కుసుమప్రియ (13) ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుంది. అప్పుల బాధలు కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.