మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 11 జులై 2020 (12:11 IST)

వికాస్ దూబే మరణంపై అతని గ్రామంలో పండుగ సంబరాలెందుకు?

బతికున్నప్పుడు కంటే చనిపోయినప్పుడు నలుగురు మెచ్చుకోవాలంటారు పెద్దలు. దానికి వికాస్ దూబే వ్యవహారం విరుద్దం. తన వల్ల ఇంతవరకు తన గ్రామంలో మిగిలిన వారంతా స్వేచ్చ లేకుండా తిరిగామని అతడు చనిపోతే తమకు ఇష్టం వచ్చినట్లు బతకవచ్చునని గ్రామ ప్రజలు ఆశించారు.దీనికోసం కలలు గన్నారు కూడా.
 
ప్రస్తుతం అతడి మరణంతో వాళ్ల గ్రామ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతటి కరుడుకట్టిన హంతకుడు వికాస్ దూబే. ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టించిన గ్యాంగస్టర్. చివరికి ఎన్‌కౌంటర్లో చనిపోవడం అతడి గ్రామ ప్రజలకు ఎక్కడలేని సంతోషాన్ని నింపింది. అంటే ఆ గ్రామ ప్రజల్ని ఎంతగా ఇబ్బంది పెట్టి ఉంటాడో ఆలోచింపదగ్గ విషయమే.