గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (00:40 IST)

బురఖాకు మనోభావాలకు సంబంధం ఉందా? ఉందంటున్న విద్యా బోర్డు

అమ్మాయిలు ఏ రకమైన దుస్తులు వేసుకోవాలో, కూడదో, ఎలాంటి దుస్తులు ధరిస్తే వారిని రేప్ చేస్తారో, చెయ్యరో కూడా నిర్దేశం చేస్తూ మహిళల జీవితాలను నిర్వచిస్తున్న ఆధునిక ఫ్యూడల్స్ (భూస్వామ్య యుగ వాదులు) రాజ్యమేలుతున్న ప్రస్తుత భారత్‌లో ముస్లిం విద్యార్థినుల బు

పరీక్షా కేంద్రాల్లో బురఖాతో వస్తున్న అమ్మాయిలను తనిఖీ చేయడం ఒక వర్గం స్త్రీల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందన్న వాదనకు ఆమోదం లభించింది.  ముఖ్యంగా పరీక్షలు రాయడానికి వస్తున్న ముస్లిం విద్యార్థినులను ప్రవేశ ద్వారం వద్దే అడ్డుకునే విధానాలకు ఇకనుంచి స్వస్తి చెప్పాలని మహారాష్ట్ర సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యాబోర్డు స్పష్టం చేయటంతో ఆ రాష్ట్ర ముస్లిం విద్యార్థినులకు పెద్ద ఊరట లభించినట్లయింది. 
 
ఈ విద్యా సంవత్సరంలో 10, 12వ తరగతి పరీక్షలు రాసే ముస్లిం విద్యార్థినిలను బురఖాతో పరీక్ష కేంద్రాలకు అనుమతించాలని మహారాష్ట్ర సెకండరీ, హయ్యర్‌ సెకండరీ విద్యా బోర్డు స్పష్టం చేసింది. అందుకు అవసరమైన సర్క్యూలర్‌ అన్ని పాఠశాలలకు పంపించింది. దీంతో బురఖాతో పరీక్ష కేంద్రాలకు వచ్చే ముస్లిం బాలికలకు ఊరట లభించింది. ఈ నెల మూడో వారం నుంచి 12వ తరగతి పరీక్షలు, మార్చి ఆఖరు వారం నుంచి 10వ తరగతి పరీక్షలు జరనున్నాయి.
 
గతంతో 10, 12 తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చిన  ముస్లిం విదార్థినిలను కొన్ని కేంద్రాలలో ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకునేవారు. బురఖా తీసి, తనిఖీ చేసిన తరువాత మాత్రమే వారిని లోపలికి అనుమతించేవారు. దీంతో వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర విద్యా బోర్డు ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. 
 
బురఖా తీయమని చెప్పడం, తనఖీ చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మతాన్ని అవమానించినట్లవుతుందని బోర్డు అభిప్రాయపడింది. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద గందరగోళం నెలకొనే ప్రమాదముందని, దాన్ని నివారించేందుకు తాజా ఆదేశాలు జారీ చేసింది.
 
అమ్మాయిలు ఏ రకమైన దుస్తులు వేసుకోవాలో, కూడదో, ఎలాంటి దుస్తులు ధరిస్తే వారిని రేప్ చేస్తారో, చెయ్యరో కూడా నిర్దేశం చేస్తూ మహిళల జీవితాలను నిర్వచిస్తున్న ఆధునిక ఫ్యూడల్స్  (భూస్వామ్య యుగ వాదులు) రాజ్యమేలుతున్న ప్రస్తుత భారత్‌లో ముస్లిం విద్యార్థినుల బురఖాలపై ఆంక్షలు ఎత్తివేయడం కూడా విప్లవాత్మకమైన చర్యే అని చెప్పాల్సి వస్తుందేమో..