తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ రేస్ : పళని వర్సెస్ పన్నీర్.. నువ్వా నేనా!?  
                                          తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం అసలైన ఆట ఇపుడు మొదలైంది. ఈ కుర్చీకోసం  రాజకీయ చదరంగం ఆడిన శశికళ.. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో క్లీన్ బౌల్డ్ అయ్యారు. అయితే, ఇటు పార్టీ, అటు ప్రభుత్వ
                                       
                  
				  				  
				   
                  				  తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం అసలైన ఆట ఇపుడు మొదలైంది. ఈ కుర్చీకోసం  రాజకీయ చదరంగం ఆడిన శశికళ.. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో క్లీన్ బౌల్డ్ అయ్యారు. అయితే, ఇటు పార్టీ, అటు ప్రభుత్వంపై పట్టు నిలుపుకునేందుకు తన ప్రధాన అనుచరుడు ఎడప్పాడి పళనిస్వామి పేరును తెరపైకి తెచ్చి... ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వర్గం ఎమ్మెల్యేలతో ఎన్నుకునేలా చక్రం తిప్పారు. దీంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశివర్గం నేత పళని స్వామిల మధ్య రసవత్తర పోరుకు తెరలేచింది. 
				  											
																													
									  
	 
	నిజానికి అన్నాడీఎంకేలోనే పళని స్వామి, పన్నీర్ సెల్వం బద్ధ విరోధులు. ఇద్దరూ ఇద్దరే. జయలలితకు పన్నీర్ సెల్వం, చిన్నమ్మకు పళనిలు వీర విధేయులు కూడా. ఇప్పుడు ఇద్దరూ సీఎం పీఠం కోసం పోటీ పడుతున్నారు. నిజానికి, శాసనసభాపక్ష నేతగా పళనిస్వామి ఎన్నికైన వెంటనే, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు ఫ్యాక్స్ చేశారు. 
				  
	 
	సాయంత్రం 5.30 గంటలకు 12 మంది సీనియర్ మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి లేఖ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరారు. శశికళ వర్గం వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం.. ఓపీఎస్‌కు మద్దతు పలికిన ఎంపీ మైత్రేయన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్ గవర్నర్‌ను కలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఆ తర్వాత కొద్దిసేపటికే గవర్నర్ డీజీపీ రాజేంద్రన్‌ను పిలిపించుకుని శాంతిభద్రతలపై మాట్లాడారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు రెండు వర్గాల్లో ఎవరిని ముందుగా పిలిచినా విమర్శలు తప్పకపోవచ్చని గవర్నర్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అటార్నీ జనరల్ సూచించినట్లుగా.. ‘కాంపోజిట్’ బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో తగినంత మెజారిటీ ఉన్నవారే ముందుకొస్తారని, తానూ విమర్శల నుంచి బయటపడవచ్చన్న ఉద్దేశంలో గవర్నర్ ఉన్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.