శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (19:46 IST)

50 సంవత్సరాల్లో అంగారక గ్రహానికి చేరుకోగలిగాం.. జమ్మూలో మాత్రం?: సుప్రీం జడ్జి కంటతడి

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ కంటతడిపెట్టారు. జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి అనే మాట కరువైందని వాపోయారు. 50 ఏళ్ల క్రితం తాను చదువుకునేటప్పుడు ఉన్నట్టుగానే పాఠశాలలో విరిగిన కుర్చీలున్నాయన్నారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ కంటతడిపెట్టారు. జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధి అనే మాట కరువైందని వాపోయారు. 50 ఏళ్ల క్రితం తాను చదువుకునేటప్పుడు ఉన్నట్టుగానే పాఠశాలలో విరిగిన కుర్చీలున్నాయన్నారు. 50 ఏళ్ల తర్వాత తిరిగి తన పాఠశాలకు వచ్చి చిన్ననాటి స్నేహితులను, గురువులను, శ్రేయోభిలాషులను కలుసుకోవడం ఆనందాన్నిచ్చినా స్థానిక పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయంటూ దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. గడిచిన 50 సంవత్సరాల్లో అంగారక గ్రహానికి కూడా చేరుకోగలిగామని.. కానీ జమ్మూలోని సెంటర్ బేసిక్ స్కూళ్లో మౌలిక వసతులు మాత్రం మారలేదని కంటతడి పెట్టారు. 
 
గత 25, 30 ఏళ్లుగా జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదంతో పరిస్థితులు బాగోలేవనే సంగతి అందరికీ బాగా తెలుసునని, ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నా విద్యా రంగాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఉగ్రవాదులు పాఠశాలలను కూడా తగులబెట్టడంపై ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను భవిష్యత్తుపై ఆశావాహంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. గతంలో జడ్జీల నియామకం చేపట్టకుండా కేంద్రం జాప్యం చేస్తుందంటూ కంటితడి పెట్టుకున్న ఠాకూర్.. జమ్మూ పరిస్థితులపై మళ్లీ భావోద్వేగానికి గురైయ్యారు.