మేం జూన్ వరకు 'ఉచిత రేషన్' ఇస్తున్నాం.. మోదీ ప్రకటనపై మమతా సెటైర్లు
నవంబర్ వరకు దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామని, దీని కోసం రూ. 90 వేల కోట్లను ఖర్చు చేయబోతున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెటైర్లు వేశారు.
నవంబర్ వరకే ఫ్రీ రేషన్ ఇస్తున్నట్టు మోదీ ప్రకటించారని, వచ్చే ఏడాది జూన్ వరకు తాము రేషన్ సరుకులను ఉచితంగా ఇవ్వబోతున్నామని మమత చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సరుకుల క్వాలిటీ కంటే తాము ఇచ్చే సరుకుల నాణ్యత మెరుగ్గా ఉందని అన్నారు. పశ్చిమబెంగాల్ లో కేవలం 60 శాతం మంది ప్రజలకు మాత్రమే కేంద్ర రేషన్ అందుతోందని చెప్పారు.