శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (08:21 IST)

బెంగాల్ - అస్సాంలలో రెండో దశ పోలింగ్ : మమత భవితవ్యం తేల్చనున్న ఓటర్లు

వెస్ట్ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. కొవిడ్‌ మహమ్మారి భయపెడుతున్నప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ తొలి దశలో భారీగా పోలింగ్‌ నమోదు కాగా.. రెండో దఫాలోనూ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తే అవకాశాలు ఉన్నాయి. 
 
పలు కీలక స్థానాలపై ఆసక్తి నెలకొంది. బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ - వామపక్షాలు - ఐఎస్‌ఎఫ్‌ కూటమి తరపున సీపీఎం నుంచి యువ నేత మీనాక్షి ముఖర్జీ బరిలో ఉన్నారు. 
 
దెబ్రాలో ఇద్దరు మాజీ ఐపీఎస్‌ ఉన్నతాధికారులు ముఖాముఖి తలపడనున్నారు. బీజేపీ తరపున భారతీ ఘోష్‌, తృణమూల్‌ నుంచి హమయూన్‌ కబీర్‌ బరిలో ఉన్నారు.