సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: ఆదివారం, 20 డిశెంబరు 2020 (20:21 IST)

ప్రియుడితో స్నానం చేస్తూ అడ్డంగా దొరికిన భార్య

అసలే ఆర్థిక సమస్యలు. భార్య అడిగినవన్నీ తీసివ్వలేని భర్త. తన కోర్కెలను చంపుకోలేని భార్య. చివరకు పండంటి సంసారాన్ని చేజేతులా నాశనం చేసేసుకుంది. అన్నీ కొనిచ్చే ప్రియుడే భర్త కన్నా గొప్పని నమ్మిన వివాహిత అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది.
 
జార్ఖండ్ లోని చత్తర్‌పూర్ గ్రామంలో నివాసముంటున్న భజన్ లాల్, సోనంలకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కుదువ వ్యాపారం షాపులో పనిచేస్తున్నాడు భజన్ లాల్. అక్కడిచ్చే డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోయేవి.
 
కానీ భార్య సోనం మాత్రం అది కావాలి..ఇది కావాలి అంటూ గొంతెమ్మకోర్కెలు కోరేది. ఎన్నో రోజుల పాటు భర్త బుజ్జగిస్తూ వచ్చాడు. కానీ ఆమె మారలేదు సరికదా ఒక వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ వ్యక్తి పేరు రంజన్. బంగారు వ్యాపారి. కావాల్సినంత డబ్బు ఉంది. సోనం ఇంటికి సమీపంలోనే ఉండేవాడు. ఇంకా వివాహం కాలేదు. దీంతో అతనికి సోనమే కనెక్టయ్యింది. మూడు నెలల నుంచి అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఏది కావాలంటే అది కొనిచ్చేవాడు రంజన్.
 
దీంతో భర్త కన్నా ప్రియుడే ఎక్కువగా భావించింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు అతని దగ్గరకు వెళ్లేది. భర్తకు తెలిసి మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు సరికదా తాను అసలు ఎవరితోను పరిచయం పెట్టుకోలేదని తప్పించుకునే ప్రయత్నం చేసింది.
 
కానీ మూడురోజుల క్రితం రాత్రి వేళల్లో కలుద్దామని రంజన్ చెప్పాడు. రాత్రి సమయంలో భర్తకు తెలిసిపోతుందని సోనం ప్రియుడికి చెప్పింది. నిద్రపోయిన తరువాత రా అంటూ చెప్పాడు. భర్త, కొడుక్కి భోజనం పెట్టిన తరువాత వారిద్దరు నిద్రపోయిన తరువాత ఇంటి నుంచి మెల్లగా బయటకు వెళ్లింది.
 
తాను ఉన్న ప్రాంతానికి సమీపంలో రంజన్‌కు పొలాలు ఉన్నాయి. అందులోకి సోనంను తీసుకెళ్లి ఇద్దరూ కలిసి స్నానం చేస్తూ ఎంజాయ్ చేశారు. భార్య బయటకు వెళుతుండడాన్ని చూసిన భర్త మెల్లగా ఆమె వెనుకే వెళ్ళాడు. నగ్నంగా ఉన్న భార్య, రంజన్‌ను చూసి ఇద్దరినీ చెట్టుకు కట్టేసి చావబాదాడు. ఆ తరువాత ఊరి పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టాడు. అయితే తనకు భర్త కన్నా ప్రియుడే కావాలంటూ సోనం పంచాయతీ పెద్దలకు తేల్చిచెప్పింది. దీంతో ఈ కేసు కాస్త పోలీసు స్టేషన్‌కు వెళ్ళింది.