గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 మార్చి 2017 (10:08 IST)

ఆవులను కించపరిచినా రెండు కాళ్ళు విరగ్గొడతా : బీజేపీ ఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నోటికి పని చెపుతున్నారు. నిత్యం వివాదాల్లో మునిగితేలే ఈ రాష్ట్ర బీజేపీ నేతలు.. ఇపుడు అధికారంలోకి వచ్చాక మరింతగా రెచ్చిపోతున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నోటికి పని చెపుతున్నారు. నిత్యం వివాదాల్లో మునిగితేలే ఈ రాష్ట్ర బీజేపీ నేతలు.. ఇపుడు అధికారంలోకి వచ్చాక మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్‌ సైనీ ఆవుల విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఎవరైనా ఆవులను కించపరిచినా.. వాటిని చంపినా కాళ్లు విరగ్గొడతా' అని ఆయన హెచ్చరించారు.
 
కాగా, ఇటీవల వెల్లడైన ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బంపర్ మెజార్టీతో గెలుపొందిన విషయం తెల్సిందే. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు చేపట్టి... అక్రమ గోవధశాలలపై కొరడా ఝళిపించారు. అక్రమ గోవధశాలలన్నీ మూసేయాలని ఆదేశించారు. అలాగే, పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆయన అధికారులను కోరారు.