శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (16:46 IST)

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా

omar abdullah
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ - నేషనల్ కాన్పరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతుంది. ఇప్పటివరకు అందిన ట్రెండ్స్ మేరకు మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ - ఎన్సీ కూటమి ఏకంగా 51 చోట్ల ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కేవలం 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. పీడీపీ 2, ఇతరులు 9 చోట్ల లీడ్‌లో ఉన్నారు. దీంతో ఇండియా కూటమ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 
 
ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌కు కాబోయే ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా అని చెప్పారు. ప్రజలు గొప్ప తీర్పును ఇచ్చారని ఆయన కొనియాడారు. మరోవైపు, ఫరూక్ అబ్దుల్లా కుమారుడైన ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో ఇండియా కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా ఇంటి వద్ద ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.