మహిళా ప్యాసింజర్‌కు అశ్లీల చిత్రాన్ని చూపించిన ఓలా క్యాబ్ డ్రైవర్

కారులో ఎక్కిన మహిళా ప్రయాణికురాలికి ఓలా క్యాబ్ డ్రైవర్ అశ్లీల వీడియో చూపించి ముచ్చెమటలు పోయించాడు. బెంగుళూరు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

blue whale challege
pnr| Last Updated: సోమవారం, 27 ఆగస్టు 2018 (17:14 IST)
కారులో ఎక్కిన మహిళా ప్రయాణికురాలికి ఓలా క్యాబ్ డ్రైవర్ అశ్లీల వీడియో చూపించి ముచ్చెమటలు పోయించాడు. బెంగుళూరు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యలహంక ఓల్డ్‌టౌన్‌ నుంచి జేపీ నగర్‌కు వెళ్లడానికి గురువారం ఓ ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. సదరు మహిళను క్యాబ్‌డ్రైవర్ పికప్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత విధాన సౌధ జంక్షన్ నుంచి క్వీన్స్‌ సర్కిల్‌ వైపు వెళుతున్న సమయంలో వెనుక సీటులో కూర్చున్న మహిళకు బ్లూ ఫిలిం కనబడేలా తన మోబైల్‌ను పట్టుకున్నాడు. 
 
క్యాబ్‌డ్రైవర్‌ ప్రవర్తనతో భయపడిన మహిళ వాహనం ఆపాలని కోరింది. అయితే అతను పట్టించుకోకుండా జేపీ నగరలో ఆపాడు. దీంతో బాధితురాలు ఒకరోజు ఆలస్యంగా కబ్బన్‌ పార్కు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి క్యాబ్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :