మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (11:21 IST)

నిఖా హలాల పేరుతో దారుణం : భార్యను గదిలో బంధించి తండ్రితో రేప్ చేయించిన భర్త

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నిఖా హలాలా పేరుతో కట్టుకున్న భర్తే తన భార్యను తండ్రితో పాటు మరో ముగ్గురు వ్యక్తులతో అత్యాచారం చేయించాడు. ఫలితంగా ఆ మహిళ గర్భందాల్చి.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నిఖా హలాలా పేరుతో కట్టుకున్న భర్తే తన భార్యను తండ్రితో పాటు మరో ముగ్గురు వ్యక్తులతో అత్యాచారం చేయించాడు. ఫలితంగా ఆ మహిళ గర్భందాల్చి.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్త...
 
మొరదాబాద్‌ జిల్లాకి చెందిన ఓ మహిళకి 2014 డిసెంబర్‌లో ఓ వ్యక్తితో వివాహమైంది. పెళ్లి అయిన కొద్ది రోజులకే అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. 2015 డిసెంబర్‌లో ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. ఆ తర్వాత ఆ మహిళ పోలీసు కేసు పెట్టింది. పోలీసుల మధ్యవర్తిత్వంతో ఈ కేసు గ్రామ ముస్లిం పెద్దలు జోక్యం చేసుకుని వారి మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో అంతా సద్దుమణిగి పోయిందనీ ఆ మహిళ భావించింది. 
 
కానీ, ఇక్కడే భర్త సరికొత్త నాటకానికి తెరతీశాడు. కట్టుకున్న భర్తే నిఖా హలాలను ముందుకు తీసుకొచ్చాడు. మనకు విడాకులయ్యాయని, ఆచారం ప్రకారం మరో పెళ్లి చేసుకోవాలని మహిళను సూచించాడు. మావయ్య (తన తండ్రి)తో కాపురం చెయ్యాలని వేధించాడు. అయితే ఆ మహిళ అలా మరో పెళ్ళి చేసుకునేందుకు ససేమిరా అంది. 
 
దీంతో ఆగ్రహించిన భర్త.. భార్యను గదిలో బంధించాడు. ఆ తర్వాత నియమం పేరుతో కోడలిపై మావయ్య అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఆ మహిళకు మావయ్య విడాకులిచ్చాడు. అనంతరం భర్త బంధువులైన మరో ముగ్గురు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో గర్భం దాల్చిన సదరు మహిళ 2017లో బాబుకు జన్మనిచ్చింది. 
 
నిఖా హలాల పేరుతో అత్యాచారం చేసిన అత్తింటి వారిపై మహిళ ఆదివారం మొరదాబాద్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నారని మహిళ వాపోయారు. సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
నిఖా హలాల్‌ అంటే... 
ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది.