మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (14:34 IST)

మహిళా సెక్రటరీపై అత్యాచారం.. ఆ తర్వాత టెన్త్ ఫ్లోర్ నుంచి...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. తన వద్ద సెక్రటరీగా పని చేసే యువతిపై లైంగిక దాడి చేసిన వ్యక్తి... ఆ తర్వాత పదో అంతస్తు నుంచి కిందకు తోసేసిన దారుణ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాన్పూర్‌కు చెందిన ప్రతీక్ వైశ్ (40) అనే వ్యక్తి డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతని వద్ద 19 యేళ్ల యువతి సెక్రటరీగా పనిచేస్తుంది. ఆమెపై కన్నేసిన ప్రతీక్.. మంగళవారం పని ఉందని చెప్పి బాధితురాలిని కళ్యాణ్‌పూర్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. 
 
అక్కడ శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. డబ్బు ఇస్తానని కూడా ఆశ చూపాడు. అయితే.. అందుకు ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బీబీజీటీఎస్ మూర్తి వివరించారు. 
 
ఈ దారుణం గురించి పోలీసులకు చెబుతానని ఆమె బెదిరించడంతో నిందితుడు పదో అంతస్తులో తాను ఉంటున్న ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు తోసేయడంతో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. నిందిదతుడిని బుధవారం అరెస్టు చేసి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి కస్టడీకి తరలించినట్లు తెలిపారు.