శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (15:10 IST)

మరో రెండు రోజుల్లో పెళ్లి - అంతలోనే టీచరమ్మ ఆత్మహత్య

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో ఓ విషాదకర ఘటన జరిగింది. మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సివుండగా, అంతలోనే ఓ టీచర్ సూసైడ్ చేసుకుంది. తూత్తుక్కుడి పట్టణంలోని నజ్రత్‌ డేనియల్‌ వీధికి చెందిన సెంథిల్‌ మురుగన్, శాంతి కుమార్తె వేలాంగని తెన్‌కాశిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. 
 
ఇదే కాలేజీలో పనిచేస్తున్న ఈరోడ్‌కు చెందిన యువకుడితో ఈమెకు వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇందులోభాంగా ఈ నెల 9వ తేదీన వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, సోమవారం వేలాంగని తల్లితో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.