పక్కింటి వ్యక్తితో కారులో వెళ్లిన రేష్మా అనుమానాస్పద మృతి?
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ మహిళా నేత అనుమానాస్పదంగా చనిపోయారు. పక్కింటి వ్యక్తితో కలిసి కారులో వెళ్లి ఆమె శవమై తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మృతి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, రేష్మా పడెకనురా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కీలక మహిళ నేతగా ఉన్నారు. ఆమె మృతదేహం కొల్హార్‌కు సమీపంలో గల కృష్ణానదిలోని నీటిపై తేలుతూ కనిపించింది.
ఇదే విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేష్మా మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం పక్కింటి వ్యక్తితో కలిసి తన కారులో ఆమె బయటకు వెళ్లినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె శవమై నదిలో తేలింది. కాగా, 2013లో జేడీఎస్ పార్టీ తరపున తనకు సీటు కేటాయించకపోవడంతో ఆమె అసంతృప్తి చెందారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉన్నారు.