సోమవారం, 31 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2025 (13:58 IST)

Bengaluru women స్నేహితుడే కామాంధుడు, హోటల్ టెర్రాస్ పైన రేప్

gang rape
Bengaluru women మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గార్డెన్ సిటీ బెంగళూరులో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. బెంగళూరు నగరం కోరమంగళ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి దాటి శుక్రవారం తెల్లవారు జామున ఓ మహిళపై నలుగురు కామాంధులు విరుచుకుపడ్డారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురిలో ఒకరు ముందుగా యువతితో పరిచయం ఉన్న వ్యక్తి. మహిళకి తను పాత స్నేహితుడినంటూ మాటలు కలిపాడు. 
 
గత జ్ఞాపకాలను గుర్తు చేయడంతో ఆ యువతి ఇతన్ని నమ్మింది. అక్కడి నుంచి ఆ యువతిని సరదాగా తాను పనిచేసే ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. కాసేపు మాటలు కలిపాక హోటల్ టెరస్ పైకి ఆ మహిళను తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు స్నేహితులు అక్కడున్నారు. అక్కడ తన మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. 
 
వీరంతా కలిసి ఒక్కసారిగా మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంతో ముగ్గురు అనుమానితులుగా ఉన్న అజిత్, విశ్వాస్, శివులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఇందులో ఇద్దరిని పశ్చిమ బెంగాల్‌లో పట్టుకోగా మరొకరిని ఉత్తరాఖండ్‌లో అరెస్టు చేశారు. నాలుగో వ్యక్తి పరారీలో ఉన్నాడు.  బాధితురాలు ఢిల్లీ వాసిగా చెప్పిన డీసీపీ ఆమెకు పెళ్లయ్యిందని బెంగళూరులో సెటిల్ అయినట్లు వివరించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.