గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:18 IST)

మహిళపై ప్రియుడితో అత్యాచారం చేయించిన మరో ప్రియురాలు

ఆమె కూడా తనలాంటి మహిళ అనే కనికరం కూడా లేకుండా ఆ మహిళపై తన ప్రియుడుతో అత్యాచారం చేయించింది. పుట్టిన రోజు వేడుకకు రమ్మని పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లా వాలివ్‌లో జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ముంబైలోని కండివలికి చెందిన ఓ యువతి(27) ఫిబ్రవరి 13వ తేదీన పుట్టినరోజు వేడుకలు జరుపుకుందాం రమ్మని తన స్నేహితురాలని తనతోపాటు ఇంటికి తీసుకువెళ్లింది. 
 
తన స్నేహితుడిని కూడా అక్కడికి రమ్మని పురమాయించింది. వేడుక జరుగుతుండగా ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వారిద్దరూ శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చారు. బాధితురాలు స్పృహ తప్పి పడిపోవడంతో నిందితురాలి సహాయంతో అతడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. కానీ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.