ఇంట్లో ఎవరూ లేరని 13 ఏళ్ల బాలుడిని రప్పించింది... అంగాన్ని కాల్చేసింది..

13 ఏళ్ల బాలుడి పట్ల ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ 13 ఏళ్ల బాలుడిపై ఒత్తిడి చేసింది. అందుకు ఆ బాలుడు నిరాకరించడంతో అతని పురుషాంగాన్ని కాల్చేసింది. ఈ ఘటన దేశ రాజధాని సమీపంలో

Last Updated: బుధవారం, 10 అక్టోబరు 2018 (15:18 IST)
13 ఏళ్ల బాలుడి పట్ల ఓ దారుణానికి పాల్పడింది. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ 13 ఏళ్ల బాలుడిపై ఒత్తిడి చేసింది. అందుకు ఆ బాలుడు నిరాకరించడంతో అతని పురుషాంగాన్ని కాల్చేసింది. ఈ ఘటన దేశ రాజధాని సమీపంలోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నోయిడాకి చెందిన ఓ వివాహిత 13 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. 
 
పక్కింటి బాలుడైన అతడిని ఇంటికి రప్పించుకుంది. ఇంకా ఆ బాలుడితో తన కోరిక తీర్చమంది. అందుకు బాలుడు నిరాకరించడంతో.. వేడిగా ఉన్న హెయిర్ స్ట్రైట్నర్‌తో బాలుడి పురుషాంగాన్ని కాల్చేసింది. దీంతో.. బాలుడు తీవ్రగాయాలపాలయ్యాడు. నొప్పి భరించలేక వెళ్లి తన తల్లితో చెప్పాడు. ఇంతలో ఆ వివాహిత ఇంటి నుంచి పారిపోయింది. 
 
చివరికి బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :