బార్మర్‌లో దారుణం: భర్తను బెల్టుతో గొంతు బిగించి హత్య.. ఎందుకో తెలుసా?
బార్మర్‌లో దారుణ చోటుచేసుకుంది. భర్తకు జీతం తక్కువని ఆయన్ని హత్య చేసింది భార్య. తక్కువ జీతం సంపాదిస్తున్నాడని భర్తను బెల్టుతో గొంతు బిగించి హత్య చేసింది.
వివరాల్లోకి వెళితే... మంజూ-అనిల్‌కుమార్ భార్యాభర్తలు. అనిల్ కుమార్ చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భర్తకు జీతం తక్కువ అని,తన కోరికలు తీర్చేందుకు తగినంత డబ్బు సంపాదించడంలేదని భార్య మంజూ భావిస్తుండేది.
ఇదే కారణంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం దంపతులు మద్యం సేవించారు. ఈ సమయంలోనే డబ్బుల విషయంలో మంగళవారం అర్థరాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన భార్య భర్తను హత్య చేసింది.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు మంజును పోలీసులు విచారించారు. విచారణలో మంజు హత్య చేసినట్లు ఒప్పుకుంది. నేరం ఒప్పుకోవడంతో నిందితురాలు భార్య మంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు మొత్తం హత్యాకాండపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.