శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (18:15 IST)

రాత్రిళ్లు డ్యూటీకి వచ్చేది ఏదో సరదా కోసం కాదు... బీజేపీ నేతకు పోలీస్ షాక్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార బీజేపీకి చెందిన జిల్లా స్థాయి నేతకు ఓ మహిళా అధికారిణిని తేరుకోలేని షాక్ ఇచ్చారు. "మేము రాత్రిళ్లు కుటుంబాన్ని వదిలి డ్యూటీకి వస్తాము. ఏదో సరదా కోసం కాదు. మీలాంటి వారే పార్ట

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార బీజేపీకి చెందిన జిల్లా స్థాయి నేతకు ఓ మహిళా అధికారిణిని తేరుకోలేని షాక్ ఇచ్చారు. "మేము రాత్రిళ్లు కుటుంబాన్ని వదిలి డ్యూటీకి వస్తాము. ఏదో సరదా కోసం కాదు. మీలాంటి వారే పార్టీలకు చెడ్డపేరు తెస్తారంటూ" మండిపడ్డారు. అసలేం జరిగిందో ఓసారి పరిశీలిస్తే... 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యే రాధా మోహన్‌దాస్‌ విధుల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారిణి చారు నిగమ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దాంతో ఆమె ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకోవడం తెలిసిన విషయమే. ఇప్పుడు ఇలాంటి ఘటనే మరోసారి యూపీలో వెలుగుచూసింది. అయితే ఇక్కడ జరిగింది రివర్స్‌. మహిళా పోలీసు అధికారిణి ఏ మాత్రం భయపడకుండా.. ఆ నేతకు వార్నింగ్ ఇచ్చింది. 
 
లైసెన్స్‌ లేకుండా బైక్‌ నడుపుతున్నాడని పోలీసులు ఓ భాజపా నేతకు జరిమానా విధించారు. కానీ పోలీసులు చేసింది తప్పని భాజపా కార్యకర్తల్ని అడ్డుకునే హక్కులేదని అతను ఆందోళనకు దిగడంతో శ్రేష్టా ఠాకూర్‌ అనే పోలీసు అధికారిణి వారిని మందలించారు. 
 
అంతేనా.. "మీరు లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపారు. మేము జరిమానాలు విధించడం మీకు నామోషీగా ఉంటే పోలీసులకు వాహనాలు తనిఖీ చేసే హక్కు లేదని సీఎం నుంచి అనుమతి తీసుకురండి. మేము రాత్రిళ్లు కుటుంబాన్ని వదిలి డ్యూటీకి వస్తాము. ఏదో సరదా కోసం కాదు. మీలాంటి వారే పార్టీలకు చెడ్డపేరు తెస్తారు. మీరు ఇలాగే ప్రవరిస్తే ప్రజలు మిమ్మల్ని భాజపా గూండాలని అంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే జైల్లో వేస్తా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. అందరూ మహిళ పోలీసు ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. విపక్ష నేతలంతా ఆమెకు అండగా నిలిచారు. దీంతో బీజేపీ నేతలు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. పైగా శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో అత్యంత కఠినంగా ఉంటానని హెచ్చరించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.