Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టెక్కీని గర్భవతి చేశాడు.. పెళ్లనగానే పత్తాలేకుండా పరార్.. యువతి సూసైడ్

గురువారం, 10 ఆగస్టు 2017 (16:32 IST)

Widgets Magazine
suicide

నేటి సమాజంలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతులు సైతం కామాంధుల చేతుల్లో మోసపోతున్నారు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ యువతి ఒక కీచకుని చేతిలో మోసపోయి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో దగ్గరకు చేరదీయడమే కాకుండా గర్భవతిని చేసిన ఆ కామాంధుడు.. పెళ్లి మాటెత్తగానే పారిపోయాడు. ఢిల్లీ, నోయిడాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు చెందిన ఓ యువతి నోయిడాలోని 62వ సెక్టార్‌లో ఉండే ఓ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. ఈమె తన స్నేహితులతో కలిసి ఉంటోంది. అయితే, ఆమెను ఓ యువకుడు గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నట్టుగా నటించాడు. ఈ ప్రేమ వ్యవహారం హద్దులు దాటడంతో వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా ఆమె గర్భందాల్చింది.
 
దీంతో తనను పెళ్లి చేసుకోవాలని టెక్కీ ఒత్తిడి చేసింది. కానీ, ఆ మోసగాడు మాత్రం పెద్దలు కుదిర్చిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరకడంతో.. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ కల్యాణ్‌తో రజనీకాంత్ పొట్టుపెట్టుకుంటారా? రోబో పార్టీ పేరు అదేనా?

తమిళనాట అన్నాడీఎంకే రెబల్ ఓపీఎస్ సీఎం పళనిసామి వర్గంతో ఏకమవుతున్న వేళ... తమిళ సూపర్ ...

news

భారత్‌లో రేప్ చేశాడు.. ఆస్ట్రేలియాకు వచ్చి కోర్కె తీర్చమంటూ వేధింపులు..

తన మాజీ బాస్‌పై ఓ ఎన్నారై మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. భారత్‌లో ఉండగా తనపై అత్యాచారం ...

news

యాంకర్ వార్తలు చదువుతోంది... వెనుక న్యూస్ రూంలో ఉద్యోగి పోర్న్ వీడియో వీక్షణ

బీబీసి వార్తా సంస్థ అనగానే చాలా ఉన్నత విలువలు కలిగినదిగా పేరు. ఐతే ఈ వార్తా సంస్థలో ...

news

అమెరికాపై దాడికి ఉత్తర కొరియా సిద్ధం.. హాసంగ్-12 మిస్సైళ్ల‌తో ప్లాన్

అగ్రరాజ్యం అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య యుద్ధం అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ...

Widgets Magazine