గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (06:17 IST)

ఇకపై మెట్రోలో మహిళలు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు

మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళలు మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళోచ్చని ఆదేశాలు జారీచేసింది.

ఇప్పటి వరకూ అక్కడి మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలను అనుమతించేవారు కాదు. వీటికి త్వరగా నిప్పంటుకునే స్వభావం ఉండటంతో వీటిపై నిషేధం విధించారు.
 
ప్రయాణికులెవరి వద్దనైనా పెప్పర్ స్ర్పేలు దొరికితే వాటిని సిబ్బంది వెంటనే సీజ్ చేసేవారు. దీనిపై గతంలో అనేక సార్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే..ఇటీవల మహిళలపై పెరుగుతున్న దాడులు, హైదరాబాద్‌ డాక్టర్ దిశా హత్యాచారం వంటి ఘటనల నేపథ్యంలో ‘పెప్పర్ స్ప్రేలపై నిషేధం’ మరోసారి తెరపైకి వచ్చింది.

దీనిపై చర్చించిన మెట్రో ఉన్నతాధికారులు.. మహిళల భద్రత దృష్ట్యా బెంగళూరు మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.