శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 జనవరి 2016 (13:35 IST)

శనిసింగనాపూర్‌లో ఉద్రికత్త: మహిళలకు నో ఎంట్రీ.. అయినా పూజలు 144 సెక్షన్..?1

మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శనిసింగనాపూర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళలకు ఈ ఆలయంలో ప్రవేశం లేని నేపథ్యంలో.. హెలికాప్టర్లలో దిగిమరీ ఆలయంలోకి ప్రవేశిస్తామని కొన్ని మహిళా సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తామంతా వచ్చి శనిదేవుడికి పూజలు చేస్తామని మహిళా సంఘాలు హెచ్చరించడంతో ఆలయం వద్ద పోలీసు బలగాలను మోహరించారు. 
 
మహిళలమైన తాము శనిదేవునికి పూజలు చేస్తామని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని భూమాతా రణరాగిని బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ హెచ్చరికలు జారీ చేయడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 1500 మంది వరకూ మహిళలు దూసుకు రావచ్చన్న అంచనాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి భద్రత ఏర్పాటు చేసినా.. మహిళా సంఘాలు శనీశ్వరునికి పూజ చేస్తాయని దేశాయ్ హెచ్చరించారు. దీంతో 144 సెక్షన్‌ను అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.