ఏంటిది? 48 గంటల్లో 72,000 మంది, మోదీని యోగి మించిపోతారా?

సోమవారం, 20 మార్చి 2017 (21:09 IST)

Yogi

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ పేరు ఇప్పుడు భారతదేశంలో మారుమోగుతోంది. ఆయనలా పీఠాన్ని అధిష్టించారో లేదో కాబోయే ప్రధానమంత్రి అంటూ ఆయనకు ట్యాగు లైన్లు కూడా వచ్చేశాయి. మరోవైపు ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతుదారులు గణనీయంగా పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆయన ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. 
 
ట్విట్టర్ విషయానికే వస్తే ఆయనకు శనివారంనాటి... అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందు వున్న ఫాలోవర్లు లక్షా 47వేల మంది. ఐతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 48 గంటల్లోనే ఈ సంఖ్య ఒక్కసారిగా 2 లక్షలా 19 వేలకు చేరుకుంది. ఇప్పుడా సంఖ్య కాస్తా 2.34 లక్షలకు చేరుకుంది. రెండు రోజుల్లోనే ఆయనను ఫాలో అవుతున్నవారి సంఖ్య 72 వేలకు పెరిగింది. 
 
పరిస్థితి చూస్తుంటే త్వరలోనే మోదీ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యను దాటుతారేమోనన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే యోగి ఆదిత్యనాథ్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహిత వర్గం యోగి సర్కారుపై ఓ కన్నేసి వుంచనున్నట్లు సమాచారం.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కన్నడం రాదా...? ఐతే మీపై లైంగిక దాడి తప్పదు... ఇద్దరి మహిళలపై...

కన్నడం మాట్లాడటం రాకపోతే మీపై లైంగిక దాడి తప్పదంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ...

news

రూటు మార్చుకున్న పవన్: అనంత కాదు.. కదిరి నుంచి పోటీచేస్తారట? బాలయ్య అంటే భయమా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ...

news

సిగ్గులేక సంబరాలా... నేనిలానే మాట్లాడుతా... సస్పెన్షన్ అంటే కోర్టుకెళతా... ఎమ్మెల్యే రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్సీలను ...

news

గంటాను పులివెందులలో జగన్ పైన పోటీకి పెట్టేద్దామా...? జగన్ పార్టీ మరీ ఇంతగా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి ...