బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (14:51 IST)

ఉత్తరప్రదేశ్‌లో 60 లక్షల రేషన్ కార్డులు రద్దు : సీఎం యోగి కీలక నిర్ణయం

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 60 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. వీటిల్లో దాదాపు 60 లక్షల కార్డులపై అఖిలేశ్‌ ఫొటోలు ముద్ర

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 60 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. వీటిల్లో దాదాపు 60 లక్షల కార్డులపై అఖిలేశ్‌ ఫొటోలు ముద్రించారు. అలాగే, గత ప్రభుత్వం జారీ చేసిన 4 కోట్ల కార్డులను రద్దు చేయనుంది. 
 
ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యానాథ్‌ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రభుత్వ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ కోవలో ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 60 లక్షల రేషన్‌ కార్డులను రద్దు చేయనున్నారు. వీటన్నింటిపైనా మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఫొటోలు ముద్రించి ఉండటమే దీనికి కారణం. 
 
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే హడావుడిగా అఖిలేశ్‌ ప్రభుత్వం దాదాపు నాలుగు కోట్ల రేషన్‌ కార్డులను ముద్రించారు. ఇది ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం మూలంగా వాటిల్లో చాలా కార్డులు పంపిణీ చేయలేదు. ఈ కార్డులపై సమాజ్‌వాది పార్టీ జెండా రంగులు ఎరుపు, ఆకుపచ్చ ముద్రించారు కూడా. ప్రస్తుతం యోగి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో రేషన్‌ కార్డులపై ప్రభుత్వ పెద్దల ఫొటో ఉండరాదని నిర్ణయించింది.