దేవీ నవరాత్రులలో వీటికి దూరంగా వుండాలి (Video)
నవరాత్రులలో ఏమి చేయరాదో తెలుసుకుందాం. దేవీ నవరాత్రులకు అమ్మవారిని పూజిస్తూ ఉపవాసం వుండేవారు ఈ క్రింది పనులు చేయరాదని చెపుతుంటారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
జుట్టు కత్తిరించుకోవద్దు, షేవింగ్ చేయవద్దు.
గోళ్లు తీయరాదు.
వెలిగించిన దీపపు జ్వాల కొండెక్కకుండా చూడాలి.
వెల్లుల్లి-ఉల్లి, నాన్ వెజ్ తినకూడదు
మురికి బట్టలు ధరించవద్దు.
తోలు వస్తువులను ఉపయోగించరాదు.
కొంతమంది నిమ్మకాయలు కూడా కోయకూడదంటారు.
ఉప్పు వాడటం నవరాత్రులలో కొందరు చేయరు.
పగటిపూట నిద్రపోకూడదని చెపుతారు.
ఏదైనా తినేటపుడు ఒకేచోట కూర్చుని ఆరగించాలంటారు.
ఏదైనా పాఠం సమయంలో మాట్లాడవద్దు లేదా ఇతర పనులు చేయవద్దు
పొగాకు వాడరాదు
దేవీ నవరాత్రుల సమయంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి