శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (17:53 IST)

చికెన్ చపాతీలు ఎలా చేయాలి?

రోజూ చపాతీలతో పిల్లలను బోర్ కొట్టిస్తున్నారా.. అయితే చికెన్ చపాతీలతో స్కూలు నుంచి వచ్చే పిల్లలకు సర్ ప్రైజ్ ఇవ్వండి.
 
కావలసిన పదార్థాలు : 
బోన్ లెస్ చికెన్ - ఒక కప్పు 
వెన్న - ఒక స్పూన్ 
ఉల్లి పాయ తరుగు - అరకప్పు 
గార్లిక్ పౌడర్ - అర స్పూన్ 
పచ్చి మిర్చి - నాలుగు 
క్రీమ్ - అర కప్పు 
చీజ్ - ఒక కప్పు 
చపాతీలు - ఐదు 
పాలు - అర కప్పు 
 
తయారీ విధానం: 
ఒక మూకుడులో వెన్నను కరిగించాలి. ఈ కరిగిన వెన్నలో చికెన్ ముక్కలు వేసి, బాగా వేయించాలి. మరో మూకుడు తీసుకుని దానిలో ఉల్లిపాయలు, గార్లిక్ పౌడర్, పచ్చిమిర్చి, క్రీమ్‌లను వేసి సన్నని సెగపై మీద వేపాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత దానిలో వేయించిన చికెన్ ముక్కలను వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. దీనిని ఆరు భాగాలుగా చేసి చపాతీల్లో పెట్టాలి. చపాతీలను గుండ్రంగా చుట్టి పిల్లలకు సాస్‌తో సర్వ్ చేస్తే ఇష్టపడి తింటారు.