గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By PNR
Last Updated : గురువారం, 26 జూన్ 2014 (15:42 IST)

టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారు చేస్తారు?

కావాల్సిన పదార్థాలు.. 
 
ఒక కిలో చికెన్, అరచెక్క కొబ్బరి తురుము, కారం 20 గ్రా, ధనియాల పొడి 15 గ్రా, పసుపు 5 గ్రా, జీలకర్ర 10 గ్రా, దాల్చిన చెక్క 10 గ్రా, ఒక నిమ్మకాయ రసం, లవంగాలు 5 గ్రా, ఉల్లిపాయలు 20 గ్రా, వెల్లుల్లి 5 గ్రా, అల్లం 10 గ్రా, తగినంత ఉప్పు, కొత్తిమీర 10 గ్రా, రిఫైంన్డ్ ఆయిల్ 50 ఎమ్ఎల్, నీరు 200 ఎమ్ఎల్.
 
తయారీ: మాంసం ముక్కలు కట్ చేసి, ఉప్పు, పసుపు కలిపి నానబెట్టాలి. కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం మెత్తగా పేస్టులా రుబ్బుకోవాలి. కొబ్బరి తురుము కూడా మెత్తగా రుబ్బుకోవాలి.
 
ఉల్లిపాయ ముక్కలు వేయించి, నానబెట్టిన చికెన్ వేసి బాగా కలియబెట్టాలి. రుబ్బిన మసాలా కలిపి ఐదు నిమిషాలు వేయించాలి. కొబ్బరి పేస్టు, ఉప్పు, నీరు కలపాలి. మాంసం మెత్తబడేదాకా ఉడికించి, నిమ్మరసం కొత్తిమీర కలపాలి.