బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 మార్చి 2015 (17:55 IST)

చికెన్ కర్రీ ఎలా చేయాలి?

రోజూ పప్పు, పులుసు కూరలతో బోర్ కొట్టేసిందా? అయితే చికెన్ కర్రి ట్రై చేయండి. ఎలా చేయాలంటే?
 
కావలసిన పదార్థాలు : 
చికెన్ - ఒక కిలో 
కొబ్బరి తురుము - రెండు కప్పులు 
ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు 
పసుపు పొడి - కాసింత 
జీలకర్ర పొడి - ఒక స్పూన్ 
దాల్చిన చెక్క, లవంగాలు- కాసింత 
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు 
కొబ్బరి పేస్ట్ - రుబ్బుకోవాలి.
 
తయారీ విధానం : 
బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లి ముక్కలు వేయించి, నానబెట్టిన చికెన్ వేసి బాగా కలియబెట్టాలి. రుబ్బిన మసాలా కలిపి ఐదు నిమిషాల పాటు వేయించాలి. కొబ్బరి పేస్ట్, ఉప్పు, నీరు కలపాలి. మాంసం ఉడికేంత వరకు ఉంచి.. నిమ్మరసం, కొత్తిమీర కలపాలి.