శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (16:45 IST)

చికెన్ కట్లెట్ ఎలా చేయాలి?

ఫిజికల్ యాక్టివిటీస్ పెరగాలంటే... చికెన్ తినండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనసుకు ప్రశాంతతనిచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. శరీరంలో ప్రోటీన్లను పెంచుతుంది. అలాంటి చికెన్‌తో కట్లెట్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
చికెన్ కీమా - పావు కేజీ 
ఉల్లి తరుగు - అర కప్పు 
ఉప్పు - తగినంత
కార్న్ ఫ్లోర్ - రెండు టీ స్పూన్లు 
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్ స్పూన్ 
నూనె - సరిపడా  
కొత్తిమీర తరుగు - పావు కప్పు 
పచ్చిమిర్చి తరుగు- ఒక స్పూన్ 
పసుపు - పావు స్పూన్ 
కారం - ఒక టేబుల్ స్పూన్ 
గరం మసాలా పొడి - అర టీ స్పూన్
 
తయారీ విధానం : 
ముందుగా ఓ వెడల్పాటి బౌల్‌లో చికెన్ కీమా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, కారం, గరం మసాలా,  కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కనబెట్టాలి. ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన షేపులో చేసుకుని పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక.. కొద్దిగా నూనె వేయాలి. 
 
నూనె వేగాక సిద్ధం చేసుకున్న కట్లెట్లను పెనంపై బంగారం వరకు వచ్చేంత వరకు రెండు వైపులా వేపుకోవాలి. అప్పుడప్పుడు కొద్దిగా నూనె వేయాలి. లేదా కడాయిలో నూనె వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. రెండువైపులా కాల్చుకున్న కట్లెట్లను టమాట సాస్‌తో సర్వ్ చేయండి.