శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 30 జూన్ 2014 (16:05 IST)

రంజాన్ స్పెషల్ : పాక్ రిసిపీ చికెన్ జాల్ ఫ్రీజ్

చికెన్ జాల్ ఫ్రీజ్ పాక్ వంటకం. రంజాన్ సందర్భంగా ఈ వంటకం ఎలా చేయాలో ఒకసారి ట్రై చేద్దాం.. ఈ వంటకం పాకిస్తాన్ వంటకమైనా.. హోం మేడ్ రిసిపి. ఈ వంటకం స్పెషాలిటీ ఏంటంటే.. ముఖ్యంగా రెడ్ క్యాప్సికమ్‌తో తయారు చేయడమే. ఓకే ఈ రిసిపీని ఎలా చేయాలంటే..?
 
కావలసిన పదార్థాలు :
చికెన్: అర కేజీ 
టమోటా తరుగు : అర కప్పు 
పచ్చిమిరపకాయలు: 4 (మద్యకు కట్ చేయాలి)
గరం మసాలా: ఒక టీ స్పూన్ 
నూనె: రెండు టీ స్పూన్లు 
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: పావు కప్పు(గార్నిష్ కోసం) 
అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు టీ స్పూన్లు
పసుపు : ఒక టీ స్పూన్
ఉల్లి తరుగు : అర కప్పు 
పెప్పర్ : అర టీ స్పూన్ 
రెడ్ క్యాప్సికమ్ : పావు కప్పు 
 
తయారీ విధానం :
ముందుగా ఓ బౌల్‌లో అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి గంట పాటు పక్కనబెట్టుకోవాలి. చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టాక డీప్ బాటమ్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి, అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కవేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. 
 
తర్వాత అందులో అల్లం వెల్లుల్లి తురుము వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి. మసాలా పట్టిన చికెన్ ముక్కలు కూడా వేసి మరో 5-7నిముషాలు వేగించుకోవాలి. తర్వాత మంటను తగ్గించి, చికెన్‌ను నిదానంగా వేగించుకోవడం వల్ల అవి క్రిస్పీగా మరియు బ్రౌన్ కలర్‌లోకి మారుతాయి. తర్వాత అందలోనే పచ్చిమిర్చి ముక్కలు, పెప్పర్, క్యాప్సికమ్ ముక్కలు వేసి మరికొద్ది నిముషాలు వేగించుకోవాలి. 
 
తర్వాత టమోటా ముక్కలు, ఉప్పు మిక్స్ చేసి, మరో ఐదునిముషాలు వేపాలి. ఈ గ్రేవీ మీద గరం మసాలా పౌడర్ వేసి, ఒక కప్పు నీళ్ళు కలుపుకొని మూత పెట్టి మరో 5నిముషాలు ఉడివేకించుకోవాలి. చికెన్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో చికెన్ జాల్ ఫ్రిజ్‌ను కూడా గార్నిష్ చేసి, క్రిందికి దింపుకొని వేడి వేడిగా పులావ్ లేదా రోటీలతో సర్వ్ చేసి రంజాన్ వేళ ఎంజాయ్ చేయండి.