బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2015 (18:23 IST)

చికెన్ కుర్మా ఎలా చేయాలి?

చికెన్ ప్రోటీన్ ఫుడ్. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి బరువు, కొవ్వును నియంత్రిస్తాయి. రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. అంతేగాకుండా క్యాన్సర్ ప్రభావాన్ని చాలామటుకు తగ్గిస్తాయి. అలాంటి చికెన్‌తో కుర్మా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
చికెన్ - అర కేజీ 
మైదా - రెండు స్పూన్లు, 
పసుపు - చిటికెడు, 
కొబ్బరి పేస్ట్ - అర కప్పు
పుల్లటి పెరుగు - అర కప్పు 
ఉల్లి తరుగు - అర కప్పు 
వెల్లుల్లి, అల్లం పేస్ట్ - రెండు టీ స్పూన్లు, 
గసగసాలు  - రెండు స్పూన్లు 
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్ 
ఉప్పు, కారం, నూనె - తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కల్ని ఉడికించాలి. చికెన్ ఉడికాక ముక్కలికి ఉప్పు, కారం, పెరుగు, గసగసాల పేస్ట్ కలిపి పది నిమిషాల పాటు పక్కనబెట్టేయాలి. స్టౌ మీద ప్యాన్ పెట్టి నూనె వేడయ్యాక అందులో ఉల్లిముక్కలు వేసి వేపాలి. వేగాక గరం మసాలా, చికెన్ ముక్కలు వేసుకోవాలి. ప్యాన్ మూతపెట్టి ఐదు నిమిషాలు కారం, ఉప్పు చేర్చి ఉడికించాలి. ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉంచి గ్రేవీలా అయ్యాక దించేసుకోవాలి. అంతే చికెన్ కుర్మా రెడీ.