శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2015 (19:26 IST)

చికెన్ సోయా గ్రేవీ ఎలా చేయాలి?

చికెన్ సోయా కాంబినేషన్‌లో ఈ వీకెండ్ గ్రేవీ ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు:
 
మీల్ మేకర్(సోయా బాల్స్ ) ఉడికించినవి- ఒక కప్పు
ఉడికించిన చికెన్ - ఒక కప్పు 
కార్న్‌ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్‌
సోయాసాస్ - రెండు టీ స్పూన్లు.
మిర్చి -  రెండు
అల్లం, వెల్లుల్లి ముక్కలు - తగినంత
నూనె - వేయించడానికి తగినంత
పుదీన, జీడిపప్పు, కొత్తిమీర - తగినంత
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్‌.
గరం మసాలా - ఒక టీ స్పూన్‌.
 
తయారీ విధానం : 
మూకుడులో నూనె కాగిన తరువాత చీల్చిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. అందులోనే పుదీనా కూడా వేసి కొద్దిగా వేగిన తరువాత మీల్‌ మేకర్ మెదిపిన చికెన్ ముక్కల్ని వేయాలి. ఆ తరువాత సోయాసాస్‌ కూడా వేసి బాగా కలిపి నీళ్లు పోసి చిక్కబడ్డాక దించేయాలి. ఈ సోయా చికెన్ గ్రేవీ.. రెడీ.. ఇది అన్నం... రోటీల్లోకి రుచిగా ఉంటాయి.